ఊహించాను.. నా కుమారుడు సాధిస్తాడని: వైఎస్ జగన్ తల్లి విజయమ్మ

  • గొప్ప విజయం, ప్రజలు మెచ్చిన విజయం
  • దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు
  • జగన్ ఏం చెప్పాడో అవన్నీ తప్పకుండా చేస్తాడు
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఊహించని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని, ఇంకా కొన్ని స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ విజయంపై వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే స్పందించారు. తాజాగా, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, జగన్ తల్లి సంతోషం వ్యక్తం చేేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘నా కొడుకు సాధిస్తాడని ఊహించాను. గొప్ప విజయం, ప్రజలు మెచ్చిన విజయం. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. తన (జగన్) నోట ఏమైతే చెప్పాడో అవన్నీ తప్పకుండా చేస్తాడు, దేవుడు చేయిస్తాడు’ అని అన్నారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Elections
YSRCP
jagan

More Telugu News